News February 15, 2025

జగిత్యాల: జిల్లాలోని 50 PACS పాలకవర్గాల గడువు పొడిగింపు

image

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు రేపటితో ముగియనుంది. దీంతో ప్రభుత్వం పాలక వర్గాల గడువును 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. JGTL జిల్లాలో 50 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రస్తుత పాలకవర్గాలకు మరో 6 నెలల పాటు అవకాశం లభించింది. ప్రస్తుత PACSల పునర్విభజన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటివరకు ఆయా సంఘాల ఛైర్మన్లు పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతారు.

Similar News

News July 6, 2025

కాసేపట్లో వర్షం: HYD వాతావరణ కేంద్రం

image

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, HYD, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

News July 6, 2025

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వం: పొంగులేటి

image

గత పాలకులు రూ.8.19 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో మరికొన్ని హామీలను కూడా అమలు చేస్తామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్నం బియ్యం పంపిణీ, సన్నాలకు రూ.500 బోనస్, ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి అనేక హామీలను అమలుచేశామన్నారు.

News July 6, 2025

NGKL: జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన- కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రేపు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం తెలిపారు. ఉదయం 10:30కు మన్ననూర్ గృహవాని గెస్ట్ హౌస్‌కు చేరుకొని అక్కడే రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అమ్రాబాద్ పీడబ్ల్యూ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.