News April 13, 2025

జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా!

image

జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.200-210 ఉండగా.. స్కిన్లెస్ కేజీ రూ.230-240 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. జిల్లాలో చికెన్ ధరలు నిలకడగానే ఉన్నాయి అని నిర్వాహకులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

Similar News

News September 18, 2025

బంధాలకు భయపడుతున్నారా?

image

గామోఫోబియా అనేది రిలేషన్‌షిప్‌కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్‌మెంట్‌కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.

News September 18, 2025

ప్రపంచ వెదురు దినోత్సవం – చరిత్ర

image

ప్రపంచ వెదురు సంస్థ(WBO) 8వ సమావేశం బ్యాంకాక్‌లో 2009లో జరిగింది. దీనికి 100 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వెదురు ప్రాధాన్యతను గుర్తించి ఏటా సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించగా.. ప్రతినిధులంతా ఆమోదించారు. అప్పటి నుంచి ఏటా SEP-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తూ.. వెదురు ప్రాముఖ్యత, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న మేలును ప్రజలకు వివరిస్తున్నారు.

News September 18, 2025

ఈ నెల 30 వరకు అసెంబ్లీ

image

AP: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 30 వరకు (10 రోజులు) నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సభలో చర్చించేందుకు టీడీపీ 18 అంశాలను ప్రతిపాదించింది. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉండనున్నాయి. మరోవైపు శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది.