News February 16, 2026

జగిత్యాల జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

image

జిల్లాలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ దృష్ట్యా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపల్ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Similar News

News February 21, 2026

అన్నమయ్య: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

అన్నమయ్య జిల్లాలో ఈనెల 23 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఐవో రవి వెల్లడించారు. మదనపల్లెలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 50 కేంద్రాల్లో 28,550 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 14,607 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 13,943 మంది ఉన్నారన్నారు. 700మంది ఇన్విజిలేటర్లు, 5 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తాయన్నారు.

News February 21, 2026

కోదాడ: గడ్డి మిషన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

image

కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజు (23) ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై గోపాల్ రెడ్డి వివరాల ప్రకారం.. గడ్డి మిషన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై ఈనెల 9న నాగరాజు విషం తాగాడు. మొదట ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News February 21, 2026

ఇంటర్వ్యూతో ANGRAUలో ఉద్యోగాలు

image

ఏపీలోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(ఫామ్ మెషినరీ, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్), BTech, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇవాళ ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. టీచింగ్ అసోసియేట్‌కు నెలకు రూ.61,000+HRA, పార్ట్ టైమ్ టీచర్‌కు రూ.27,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://angrau.ac.in/