News February 9, 2025
జగిత్యాల జిల్లాలో కీచక టీచర్ అరెస్ట్

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరిట 6వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లదండ్రులకు చెప్పింది. దీంతో కటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News July 10, 2025
17వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ సిద్ధం: పొన్నం

TG: నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో 60వేల ఉద్యోగాలు ఇచ్చాం. 17వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఆఫీసర్స్ కమిటీ వేసి స్ట్రీమ్‌లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి వివరించారు.
News July 10, 2025
కల్తీ కల్లు ఘటన.. 44కి చేరిన బాధితులు: మంత్రి

కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రస్తుతం నిమ్స్‌లో 31 మంది, గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
News July 10, 2025
కోరుట్ల: గరుడ వాహనంపై విహరించిన వేంకటేశ్వరుడు

గురు పూర్ణిమ సందర్భంగా కోరుట్లలోని అతిపురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గరుడ సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి సందర్భంగా తిరుమలలో జరిగే విశేష పూజలను కోరుట్లలో స్వామివారికి చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం పురవీధుల్లో గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగించారు.