News February 9, 2025
జగిత్యాల జిల్లాలో కీచక టీచర్ అరెస్ట్

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఎస్ఐ సుధాకర్ ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరిట 6వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు తల్లదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 12, 2025
కరీంనగర్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

కరీంనగర్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన కరుణాకర్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ మండడం మహ్మాదాపూర్‌కి చెందిన నర్సింహాచాలి ఆనారోగ్యంతో ఉరేసుకున్నాడు. మానకొండూర్ మండలం పోచంపల్లికి చెందిన అంజయ్య మానసిక స్థితి సరిగా లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 12, 2025
సైదాపూర్: గ్రూప్-2 RESULT.. యువకుడికి 70వ ర్యాంక్

సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌కి చెందిన సంతపురి నిఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 70వ ర్యాంకు సాధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి గతంలో గ్రూప్-4లో 7వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
News March 12, 2025
గ్రూప్-2లో ఎక్లాస్‌పూర్ వాసీకి 70వ ర్యాంక్

సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌కి చెందిన సంతపురి నిఖిల్ రెడ్డి గ్రూప్-2లో 70వ ర్యాంకు సాధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివారు. గతంలో గ్రూప్-4లో 7వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డీటీవో కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు.