News March 17, 2025

జగిత్యాల: జిల్లాలో కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా మల్లాపూర్, అల్లీపూర్‌లో 40.9℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వెల్గటూర్ 40.8, గొదురు, సిరికొండ, రాఘవపేట, గొల్లపల్లి 40.6, సారంగాపూర్ 40.5, రాయికల్, ఐలాపూర్ 40.3, జైన 40.2, మారేడుపల్లి 40.0, గుల్లకోట 39.9, మెట్‌పల్లి 39.7, జగ్గసాగర్ 39.4, నేరెల్ల 39.3, కథలాపూర్ 39.2, కోరుట్ల, మేడిపల్లిలో 39.1℃ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 17, 2025

వైసీపీ పాలనలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి: పవన్

image

AP: వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రూ.250 కోట్ల అవినీతి జరిగిందని నివేదిక వచ్చిందని తెలిపారు. 564 మండలాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేశామని, ఈ నెలాఖరులోగా మిగతా చోట్ల చేస్తామని చెప్పారు.

News March 17, 2025

ప్రతిసారీ పాక్ నమ్మకద్రోహమే చేసింది: PM మోదీ

image

బంధాలు పునరుద్ధరించేందుకు భారత్ యత్నించిన ప్రతిసారీ పాక్ నమ్మకద్రోహమే చేసిందని PM మోదీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘2014లో ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాం. నా ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ PM షరీఫ్‌ను ఆహ్వానించాం. కానీ మేమెప్పుడు నిజాయితీగా చేయందించినా ఆ దేశం నమ్మకద్రోహమే చేసింది. వారు తెలివిగా ఆలోచించి ఏదో ఒకరోజు శాంతి బాటను ఎంచుకోవాలని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News March 17, 2025

తల్లి దశదినకర్మ రోజే విగతజీవిగా తనయుడు

image

మంగోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి దశదినకర్మ రోజే తనయుడు విద్యుత్ ఘాతంతో విగతజీవిగా మారాడు. వివరాలిలా.. ముదిరాజ్ కాలనీకి చెందిన కొండ సత్తెవ్వ దశదినకర్మను కులసంఘం భవనంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమపనుల్లో సమగ్నమైన కొడుకు కృష్ణభవనం ఎదురుగా ఉన్న ఇంట్లో బట్టలు ఆరవేస్తున్న సమయంలో కరెంట్‌షాక్‌కు గురై గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

error: Content is protected !!