News March 16, 2025
జగిత్యాల జిల్లాలో చికెన్ ధరలు ఇలా

జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.170-180 ఉండగా..స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రతి ఆదివారం చికెన్ తినడం ఆనవాయితీగా మారింది.
Similar News
News November 10, 2025
యాక్సిడెంట్.. ఒకరి మృతి

నరసన్నపేట మండలం కోమార్తి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కారు మరమ్మతులకు గురికావడంతో పెద్దపాడు నుంచి మెకానిక్ కోరాడ వెంకటేశ్ వచ్చి మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ మృతిచెందగా కారులో ఉన్న సంతోశ్, సుశీల, శ్యాముల్ గాయపడ్డారు.
News November 10, 2025
SRPT: ‘ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి’

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి 44 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, తేమ శాతం 17 రాగానే కాంటా వేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తు స్టేటస్‌ను లబ్ధిదారులకు తెలియజేయాలని ఆదేశించారు.
News November 10, 2025
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు.


