News April 1, 2026
జగిత్యాల జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా ఎండ ప్రభావం కొనసాగుతోంది. వర్షం నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మంగళవారం రాఘవపేటలో అత్యధికంగా 39.5℃ నమోదైంది. ఐలాపూర్, గోదూరు 39.4, గుల్లకోట 39, మెట్పల్లి, కోరుట్ల 38.6, కొల్వాయి 38.4, మల్లాపూర్ 38.1, అల్లీపూర్, జైన 37.9, వెల్గటూర్ 37.7, మేడిపల్లి 37.2, జగ్గసాగర్ 37.1, రాయికల్ 36.9, సారంగాపూర్ 36.8, గొల్లపల్లి 36.7, పెగడపల్లి 36.6℃ నమోదయ్యాయి.
Similar News
News April 14, 2026
దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు అనన్యం: కలెక్టర్

నరసరావుపేటలో అంబేడ్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ కృతిక శుక్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు అనన్యం అని ఆమె కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొని అంజలి ఘటించారు.
News April 14, 2026
విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లు ప్రారంభం

విద్యార్థులకు, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో Vishwa Vishwani Institute of Systems and మేనేజ్మెంట్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నూతనంగా BS Computer Science (UGC AEDP) కోర్సును ప్రారంభించారు. ఈ 4 సంవత్సరాల ప్రోగ్రామ్‌లో 2 ఏళ్లు క్యాంపస్‌లో చదువు, తదుపరి 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో అప్రెంటిషిప్ శిక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 14, 2026
పోచంపల్లి: చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

పోచంపల్లి మండలం గౌస్‌కొండలో విషాదం నెలకొంది. చెరువులో సరదాగా షికారుకు వెళ్లి గల్లంతైన శివ అనే యువకుడి మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. ఆరుగురు స్నేహితులు నాటు పడవపై వెళ్తుండగా, పడవలోకి నీరు చేరడంతో ప్రమాదం సంభవించింది. ప్రాణభయంతో అందరూ నీటిలోకి దూకగా, ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈత రాని శివ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం దొరకడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


