News March 8, 2025

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం

image

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో వరుడు కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా ఈ రోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కిరణ్ ఆత్యహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Similar News

News December 19, 2025

నిజామాబాద్: నకిలీ నోట్లు ఎక్కడివి.. నిఘా వర్గాలు

image

నిజామాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల వ్యవహారం సంచలనం రేపుతోంది. వర్ని కెనరా బ్యాంక్‌లో జలాల్ పూర్‌కు చెందిన రైతు చిన్న సాయిలు క్రాప్ లోన్ చెల్లించాడు. మొత్తం 417 నోట్లు రూ.2,08,500 పూర్తిగా నకిలీవిగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ని ఎస్ఐ రాజు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వర్గాలు దీనిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

News December 19, 2025

మత్స్యకారులు సీఎం చంద్రబాబును కలిసే ఛాన్స్?

image

అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఈనెల 20 శనివారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాజయ్యపేట మత్స్యకారులు సీఎంను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ రెండు నెలలకు పైగా ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడిస్తానని హోంమంత్రి అనిత చెప్పడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. ఈనెల 16న సీఎంతో భేటీ రద్దు కావడంతో, తాళ్లపాలెంలో సీఎం అపాయింట్మెంట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

News December 19, 2025

GP నిధులు ఇలా చెక్ చేసుకోండి

image

GP నిధులను విత్ డ్రా చేయాలంటే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి/ఉప సర్పంచ్ ఉమ్మడి సంతకం(డిజిటల్ కీ) అవసరం. egramswaraj.gov.inలో GPకి కేటాయించిన, ఖర్చు చేసిన నిధుల వివరాలను గ్రామస్థులు తెలుసుకోవచ్చు. హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేస్తే ఉండే రిపోర్ట్స్ సెక్షన్‌లో ప్లానింగ్ అండ్ రిపోర్టింగ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రాష్ట్రం, జిల్లా, మండలం/బ్లాక్, గ్రామ పంచాయతీని ఎంచుకొని ‘గెట్ రిపోర్ట్‌’లో వివరాలు చూడవచ్చు.