News March 26, 2025
జగిత్యాల జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు కొన్ని రోజులుగా చల్లగా ఉన్న వాతావరణం బుధవారం వేడెక్కింది. బుధవారం జిల్లాలోని బీర్పూర్ మండలం కొల్వాయిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వెల్గటూర్, జగిత్యాల మండలాల్లో 36.6 డిగ్రీలు రాయికల్ మండలంలో 39.4, గొల్లపల్లిలో 39.2, బుగ్గారంలో 39.2, కోరుట్ల లో 39.2, మేడిపల్లిలో 39.1, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్ మండలాల్లో 39.1 భీమారంలో 39.0, మేడిపల్లి లో 39.1 ఉంది.
Similar News
News February 10, 2026
ములుగు మున్సిపాలిటీలో 19 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు

తొలిసారి ఎన్నికలు జరుగుతున్న ములుగు మున్సిపాలిటీలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఒక్క జీవంతరావుపల్లి MPPS కేంద్రం మినహా 19 కేంద్రాలను అధికారులు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 150 మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఛైర్మన్ పీఠంపై కన్నేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 10, 2026
పుంగనూరు: రౌడీషీటర్ దారుణ హత్య

పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే.భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హత్యకు గురై ఉండగా స్థానికులు గుర్తించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మృతుడిపై పలు కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఘటనపై నంగిలి పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2026
FLASH: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంకాలానికి కాస్త పెరిగింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,58,780కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.800 ఎగబాకి రూ.1,45,550 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


