News February 19, 2025

జగిత్యాల జిల్లాలో నేటి CRIME NEWS!

image

@మెట్పల్లి ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలంటూ కోరుట్లలోని కాంగ్రెస్ నేతల డిమాండ్ @మల్యాలలో కోతుల దాడి.. వ్యక్తికి గాయాలు @కొడిమ్యాలలో దారి తప్పిన చుక్కల దుప్పి @భీమారంలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన @రేపు మల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఇసుక బహిరంగ వేలం @ఇబ్రహీంపట్నంలో చోరికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు @జగిత్యాల ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించిన ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశ్

Similar News

News November 15, 2025

రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వెంటే: మహేశ్ కుమార్

image

TG: కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై సంతృప్తితోనే ప్రజలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీని గెలిపించారని PCC చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు సాధిస్తామని చెప్పారు. BCలకు 42% రిజర్వేషన్లపై CONG కమిట్మెంటుతో ఉందని, బీజేపీయే అడ్డుపడుతోందని విమర్శించారు. కాగా CM రేవంత్, DyCM భట్టి, మహేశ్‌, ‘జూబ్లీ’ విజేత నవీన్ ఇతర నేతలు ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలిశారు.

News November 15, 2025

సిర్పూర్ (టీ): యాజమాన్యం పిటిషన్‌కు యూనియన్ కౌంటర్

image

సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ (ఈ-966) ఎన్నికలను అడ్డుకునేందుకు జేకే యాజమాన్యం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయడానికి యూనియన్ వకాలతును అడ్వకేట్ ఎం. శంకర్‌కు అందజేసింది. ఎన్నికలను అడ్డుకోవడం దుర్మార్గమని వైస్ ప్రెసిడెంట్ గోగర్ల కన్నయ్య విమర్శించారు. యాజమాన్యం ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని, వెంటనే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

News November 15, 2025

తిరుపతి: 11వ సీటులోకి లగేజీ ఎలా వచ్చిందో..?

image

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయల్దేరిన TTD మాజీ AVSO స‌తీష్ కుమార్ మధ్యలో చనిపోయిన విషయం తెలిసిందే. A1 భోగిలోని 29వ నంబర్ సీటును సతీశ్ కుమార్ బుక్ చేసుకోగా 11వ నంబర్ సీట్ వద్ద ఆయన లగేజీ లభ్యమైంది. శుక్రవారం ఉదయం 6.23 గంటలకు ఆ రైలు తిరుపతికి చేరుకున్నప్పుడు బెడ్ రోల్ అటెండర్‌ రాజీవ్ రతన్ లగేజీ గుర్తించి అధికారులకు అందజేశారు. వేరే సీట్లోకి లగేజీ ఎలా వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతోంది.