News January 31, 2025
జగిత్యాల జిల్లాలో నేరాలు అదుపులో ఉన్నాయి: ఐజీ

జగిత్యాల జిల్లాలో నేరాల నివారణ, నేరాల ఛేదన లక్ష్యంగా పోలీసు అధికారులు పనిచేయాలని మల్టీజోన్ -1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేరాలు అదుపులో ఉన్నాయన్నారు. పాత నేరస్థులపై ప్రత్యేకంగా ఉంచాలన్నారు. సైబర్ క్రైమ్‌పై శ్రద్ధ వహించాలన్నారు.
Similar News
News November 6, 2025
ములుగు : ప్రాణాంతకంగా అడవి పందులు, కోతులు..!

జిల్లాలో కోతులు, అడవి పందుల బెడద ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ రెండు ప్రాణులు ఇప్పుడు మనుషులకు ప్రాణాంతకంగా మారాయి. గ్రామాలలో మందలుగా తిరుగుతున్న కోతులు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో చాలామంది గాయపడుతున్నారు. పంటలను నాశనం చేస్తున్నాయి. ఇదే తరహాలో అడవి పందులు పంటల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కాపలాకు వెళ్లిన రైతులపై దాడులకు పాల్పడుతున్నాయి. వీటిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
News November 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 6, 2025
ADB: ఈ రెండో శనివారం సెలవు రద్దు

ఈ నెల 8న రెండో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 28న అత్యధిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ శనివారం విద్యా సంస్థల సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.


