News February 8, 2026

జగిత్యాల జిల్లాలో పోటాపోటీగా ప్రచారాలు

image

జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ఎంపీ అరవింద్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీఆర్ఎస్ తరఫున జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, టీఆర్పి తరపున తీన్మార్ మల్లన్న, జనసేన తరఫున గబ్బర్ సింగ్ టీం ప్రచారం చేశారు.

Similar News

News February 8, 2026

పెబ్బేర్: పూజల పేరుతో రూ.26 లక్షల మోసం

image

పూజల పేరుతో ఒక కుటుంబాన్ని భయపెట్టి, రూ.26 లక్షల మోసం చేసిన కేసులో నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెబ్బేర్‌కు చెందిన హోటల్ నిర్వాహకుడు కుమ్మరి వెంకటేష్ నుంచి ఆదోనికి చెందిన దుర్గా సింగ్ గ్యాంగ్ బాధితుల నుంచి అంచలంచలుగా రూ.26 లక్షలు మోసం చేశారు. అనంతరం స్పందించకపోవడంతో 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI యుగంధర్ తెలిపారు.

News February 8, 2026

విద్యుత్ సమస్యలా? సీఎండీకి ఫోన్ చేయండి!

image

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం ప్రారంభించినట్లు జిల్లా SE రాజేశ్వరి తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 8688400499 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.

News February 8, 2026

మున్సి‘పోల్స్’ స్పెషల్: ఇంటికి కేజీ మటన్, చికెన్, రైస్

image

మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను ఆశిస్తున్న ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రకరకాల హామీలు ఇస్తున్నారు. రోజూ వాళ్లడిగిన మద్యం బ్రాండ్, యాట మాంసం సరఫరా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరో 2 రోజులే ఉండటం, నేడు ఆదివారం కావడంతో అభ్యర్థులు ఓటర్లకు ఇంటికీ కిలో మటన్, చికెన్ సహా ఓటర్ల సంఖ్యను బట్టీ బాస్మతి రైస్, మద్యం బాటిళ్లు పంపుతున్నారని టాక్. ఇంతకీ మీ ఇంటికి మాంసం కవర్ అందిందా? ఒట్టి మాటేనా?