News December 21, 2025
జగిత్యాల జిల్లాలో ప్రజావాణి వాయిదా: కలెక్టర్

సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో, అదే రోజు జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తెలిపారు. ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం తదుపరి తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News December 24, 2025
పెద్దపల్లి నూతన మార్కెట్‌పై ఎమ్మెల్యే సమీక్ష

పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద రూ.5 కోట్ల వ్యయంతో నూతన కూరగాయల, మాంసాహార మార్కెట్ నిర్మాణానికి చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులపై సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే విజయరమణ రావు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు వచ్చాయని, డీపీఆర్‌లు, నమూనాలను పరిశీలించిన అనంతరం మూడు నెలల్లో పనులు ప్రారంభించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.
News December 24, 2025
మానకొండూరు: పీజీటీ జగన్నాథంపై సస్పెన్షన్ వేటు

మానకొండూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల PGT గోలి జగన్నాథంను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. సహోద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు ఆయన ప్రవర్తనపై ఎంఈఓ, డీఈఓలకు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ జరిపించిన కలెక్టర్, వేధింపులు నిజమని తేలడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి తొలగిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు.
News December 24, 2025
తిరుపతిలో స్కాం.. AEO సూసైడ్‌పై చర్చ

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో <<18647016>>స్కాం <<>>జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నాటి AEOపై క్రమశిక్షణా రాహిత్యం కేసు ఎందుకు నమోదైంది? రిటైరయ్యే కొన్ని రోజుల ముందే ఆయన సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఆ కేసు ఎందుకు క్లియర్ కాలేదనేది నేటికి ప్రశ్నగా మిగిలింది.


