News November 8, 2025
జగిత్యాల జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా మన్నెగూడెంలో 15.0℃, రాఘవపేట 15.1, గోవిందారం 15.2, కథలాపూర్ 15.3, ఐలాపూర్, మల్లాపూర్ 15.4, జగ్గసాగర్ 15.6, రాయికల్ 15.7, పుడూర్, మద్దుట్ల, కోరుట్ల 15.8, గొల్లపల్లె, మల్యాల, గోదూరు 15.9, పొలాస, పెగడపల్లె 16.2, మేడిపల్లి 16.3, సారంగాపూర్, నేరెల్ల 16.4, జగిత్యాల, తిరమలాపూర్ 16.5, మెట్పల్లె, అల్లీపూర్ 16.6, బుద్దేష్‌పల్లిలో 16.8℃గా నమోదైంది.
Similar News
News March 6, 2026
BiPC స్టూడెంట్స్‌కు ఏయే కోర్సులున్నాయంటే?

<<19303162>>ఇంటర్‌లో<<>> BiPC చేసిన వారికి మెడిసిన్, ఫార్మసీతో పాటు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. NEET, TGEAPCET, ICAR వంటి ప్రవేశపరీక్షల ద్వారా MBBS, ఆయుర్వేద, హోమియో, వెటర్నరీల్లో చేరొచ్చు. డిగ్రీలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్ కోర్సులకు డిమాండ్ ఉంది. నర్సింగ్, ఫిజియోథెరపీలాంటి పారామెడికల్ కోర్సులు.. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సైకాలజీలో BSc చేయొచ్చు. రేపు 2PMకు MEC..
News March 6, 2026
ప్రకటన సరే.. అమలు సాధ్యమేనా?

16 ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించే ఆలోచన బాగున్నా అమలులో సాంకేతిక సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏజ్ వెరిఫికేషన్ చేయడం కష్టమేనని, VPN వాడి లొకేషన్ మార్చి యాక్సెస్ చేయొచ్చని అంటున్నారు. ‘తప్పుడు వివరాలతో అకౌంట్లు తెరవడాన్ని ఆపడం కష్టమే. అయితే ప్రభుత్వం టెక్ సంస్థలపై కఠిన నిబంధనలు విధిస్తూ, తల్లిదండ్రులు ఇంట్లో పర్యవేక్షణ పెంచితే ఇది సాధ్యమవుతుంది’ అని అభిప్రాయపడుతున్నారు.
News March 6, 2026
JGL: నాన్న అని పిలవలేని బాల్యం.. గణపతి కుమారుడి భావోద్వేగ గాధ

ఒక విప్లవం వెనుక సిద్ధాంతాలు, ఒక ఉద్యమం వెనుక రాజకీయ లక్ష్యాలు ఉంటాయి. కానీ ఉద్యమాల నీడలో కుటుంబం, తండ్రి, తల్లి, పిల్లల మధ్య బంధం నిశ్శబ్దంగా బలి అవుతాయి. మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావుA/Sగణపతి కొడుకు శ్రీనివాసరావు విడుదల చేసిన ఒక భావోద్వేగపూరిత సందేశం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నాన్న అని పిలవలేని బాల్యం నుంచి ఒక్కసారి చూడాలనే ఆత్రుత వరకు ఉన్న అనుబంధాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.


