News March 9, 2025
జగిత్యాల జిల్లాలో మండిన ఎండలు

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం వెల్గటూర్లో 39.6℃ నమోదవ్వగా, మారేడుపల్లి 39.4, మెడిపల్లి, పెగడపల్లి 39.3, ఐలాపూర్ 38.9, సిరికొండ 38.8, గొల్లపల్లి, రాయికల్ 38.5, మెట్పల్లి 38.4, అల్లీపూర్ 38.3, సారంగాపూర్ 38.2, కథలాపూర్, గోదూరు 38.1, జగిత్యాల, నేరెళ్ల, రాఘవపేట 38, కోరుట్ల, మన్నెగూడెం 37.7, గుల్లకోట 37.5, జగ్గసాగర్, పొలాస 37.2, మల్లాపూర్, బుద్దేష్‌పల్లిలో 37.1℃గా నమోదైంది.
Similar News
News September 19, 2025
చీరాలలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

కారు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చీరాలలోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చీరాల-తోటవారిపాలెం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 19, 2025
సమస్యల పరిష్కారంపై CM దృష్టి పెట్టాలి: రాజగోపాల్‌రెడ్డి

TG: రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ MLA రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ‘స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలి. మెజారిటీ MLAల అభిప్రాయం కూడా ఇదేనని భావిస్తున్నాను. సంక్షేమ పథకాలతో పాటు సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనన్న వాస్తవాన్ని CM గుర్తించి వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు. కాగా దీన్ని BRS నేత హరీశ్‌రావు రీట్వీట్ చేయడం గమనార్హం.
News September 19, 2025
వరంగల్: ఆయన రెక్కాడకుంటే పస్తులే..!

పూట గడవాలంటే కుటుంబ పెద్ద కష్టపడాల్సిందే. ఆయన రెక్కాడకుంటే పస్తులు తప్పవు. వయస్సు పెరిగే కొద్దీ కుటుంబం బాధ్యత పెరుగుతుంది. ఆయనే కుటుంబానికి వెన్నెముక. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లెకు చెందిన ప్రకాశం 85 ఏళ్ల వయస్సులో కూడా కష్టపడుతున్నాడు. వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ ప్రతిరోజూ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం నేటి యువతకు ఆదర్శం. మీ కామెంట్.