News February 23, 2026
జగిత్యాల జిల్లాలో ముందస్తు చర్యలు: ఎస్.ఈ

జగిత్యాల జిల్లా విద్యుత్ వినియోగదారులకు వేసవిలో మెరుగైన, నాణ్యమైన, నిరంతర సరఫరా అందించేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్.ఈ. బి.సుదర్శనం తెలిపారు. 45 ఓవర్‌లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లు,96 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 9 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 2 కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టి, అవసరమైన చోట17 కొత్త బ్రేకర్లు అమర్చామన్నారు. ఇంటర్‌లింక్ లైన్ మెరుగుపర్చామన్నారు.
Similar News
News February 24, 2026
విండీస్ గెలుపుతో టెన్షన్‌లో టీమ్‌ఇండియా

T20 WC సూపర్-8లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ విజయం సాధించడంతో భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓడిన ఇండియా ఇప్పుడు తన తదుపరి మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. విండీస్ కొట్టిన భారీ స్కోరు, మెరుగైన నెట్ రన్ రేట్ వల్ల భారత్ ఒత్తిడిలో పడింది. ఇకపై జరిగే మ్యాచుల్లో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఇండియా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News February 24, 2026
కామారెడ్డిలో జాబ్ మేళా

కామారెడ్డిలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
News February 24, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


