News February 9, 2025
జగిత్యాల జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.
Similar News
News July 6, 2025
త్వరలో డబుల్ సెంచరీ చేస్తా: వైభవ్ సూర్యవంశీ

భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనకు స్ఫూర్తి అని అండర్-19 సంచలనం వైభవ్ సూర్యవంశీ అన్నారు. నిన్న ENG అండర్19 జట్టుపై విధ్వంసకర శతకం బాదిన వైభవ్ త్వరలోనే డబుల్ సెంచరీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. జట్టు విజయం కోసం రాణించడం బాగుందని తెలిపారు. ఇప్పటికే ఇంగ్లండ్‌తో ఆడిన నాలుగు వన్డేల్లో వైభవ్ 300+ పరుగులు చేశారు.
News July 6, 2025
రేపు స్కూళ్లకు సెలవు అంటూ మెసేజులు

TG: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సోమవారం సెలవు ప్రకటించాయి. మొహర్రం సందర్భంగా సెలవు అంటూ తల్లిదండ్రులకు మెసేజులు పంపుతున్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పబ్లిక్ హాలిడే ఇవాళే ఉంది. రేపు అధికారికంగా సెలవు ప్రకటించకపోయినా కొన్ని ప్రైవేట్ స్కూళ్లు మాత్రం హాలిడే ఇచ్చాయి. మరి మీకు సెలవు ఉందని మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
News July 6, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 105 మందిపై చర్యలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో పట్టుబడ్డ 105 మందిని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రూ.2.39 లక్షల జరిమానా విధించబడింది. కొందరికి జైలు శిక్షలు కూడా విధించారు. ఈ చర్యలు ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన పెంపొందించేందుకు చేపట్టినవని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ACP మోహన్ కుమార్ తెలిపారు.