News July 7, 2025

జగిత్యాల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు. అత్యధికంగా బీర్పూర్ మండలం కొల్వాయిలో 23.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా అత్యల్పంగా కొడిమ్యాల మండలం పూడూరులో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జగిత్యాలలో 18.5, మల్లాపూర్ 16, మేడిపల్లి 13.5, వెల్గటూర్ 11.3 సారంగాపూర్ 10, కథలాపూర్ 9.8, మెట్‌పల్లి, ఎండపల్లిలో 9.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News July 7, 2025

తిరుపతి: ఎవరు లేని వారికి దేవుడే దిక్కు..!

image

నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి బస్టాండు, రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వరకు పదులసంఖ్యలో కొందరు అక్కడే తిని అక్కడే పడుకుంటారు. వీరిలో కొందరు మద్యం మత్తులో గొడవలు పడి <<16976933>>హత్య<<>>లు, హత్యాయత్నాలు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో బిక్షగాళ్లు మాత్రమే ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం కొందరు సంచరిస్తూ రాత్రిపూట యాత్రికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. పోలీసులు భక్తులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.

News July 7, 2025

వెల్లలచెరువులో వ్యక్తి మృతి

image

సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పుట్టవారిపాలెం నుంచి వినుకొండ వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ ట్రాక్టర్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 7, 2025

పెద్దపల్లి జిల్లాకు భారీ వర్ష సూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈనెల 9 వరకు పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి వనరులు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు అవసరమైతే తప్ప అత్యవసర ప్రయాణాలు చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.