News September 2, 2025
జగిత్యాల జిల్లాలో వర్షపాత వివరాలు

జగిత్యాల జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. బీర్పూర్ మండలం కొల్వాయిలో 84.5 మిల్లీమీటర్లల వర్షపాతం నమోదైంది. గొల్లపల్లి 10.8, మేడిపల్లి 14.5, ధర్మపురి 14.8, ఎండపల్లి 18, సారంగాపూర్ 24.3, వెలగటూర్ 16.3, రాయికల్ 23, పెగడపల్లి 5, మల్లాపూర్ 30.8, జగిత్యాల 10.5, కోరుట్ల 28.8, కథలాపూర్ 38.5, మెట్పల్లిలో 23.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News September 2, 2025
జియో, ఎయిర్‌టెల్.. మీకూ ఇలా అవుతోందా?

జియో, ఎయిర్‌టెల్ సిగ్నల్స్ రాక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఒకప్పటి రోజులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇంట్లో ఏదో ఒకచోటే సిగ్నల్ ఉండటం, అక్కడే నిలబడి ఫోన్ వాడటం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వీడియోలేమో ‘లోడింగ్.. లోడింగ్’ అంటున్నాయి. గ్రామాలను పక్కనపెడితే హైదరాబాద్ వంటి నగరాల్లోనూ నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఫోన్లు కలవడం లేదని చాలామంది వాపోతున్నారు. మీరేమంటారు?
News September 2, 2025
ఈనెల 9 నుంచి రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్ క్రీడలు: DYSO

రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులు ఈ నెల 5లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా క్రీడలు, యువజన అధికారి జంగపల్లి వెంకట నర్సయ్య తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో రాష్ట్ర జట్ల ఎంపికలను ఈనెల 9, 10న హైదరాబాద్‌లోని వివిధ స్టేడియాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
News September 2, 2025
ఏలూరులో యువతి మృతి..బంధువుల ఆందోళన

ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి యువతి మృతి చెందిందని ఆమె బంధువులు ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. ఏలూరు తూర్పు వీధి మేకల కబేలా ప్రాంతానికి చెందిన కటారి భారతి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. వంగాయగూడెం సెంటర్లో ఆర్ఎంపీ వైద్యుడు రెండు ఇంజక్షన్లు చేశాడని, కొంతసేపటికే స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు భారతి బంధువులు తెలిపారు.