News March 3, 2026
జగిత్యాల జిల్లాలో వినూత్న హోలీ వేడుకలు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్‌లో హోలీ పండుగను చిన్నారులు వినూత్నంగా జరుపుకున్నారు. శరీరాలపై రంగులు పూసుకుని గ్రామ వీధుల్లో సందడి చేశారు. చేతిలో UPI స్కానర్ పట్టుకుని డిజిటల్ విరాళాలు స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగదు మాత్రమే కాకుండా ఆన్‌లైన్ చెల్లింపులు కూడా స్వీకరించారు. సంప్రదాయం–సాంకేతికత కలయికతో పండుగ ఉత్సాహంగా, సంతోషంగా సాగింది.
Similar News
News April 9, 2026
వికారాబాద్: ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ఎక్స్‌ప్రెస్ టికెట్!

తాండూర్ డిపో నుంచి వికారాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ఎక్స్‌ప్రెస్ టికెట్ ఇస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలకు మించి డబ్బులు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీనరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో తిప్పడం సామాన్యుల జేబులు గుల్లచేయడానికే అని మండిపడుతున్నారు. దీంతో సామాన్యులపై అధిక భారం మోపడం సరికాదని వాపోతున్నారు. ఇలా మీకు జరిగిందా?
News April 9, 2026
ఇది విన్నారా.. పాక్ ప్రధానికి నోబెల్ ఇవ్వాలట!

పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అక్కడి మీడియా డిమాండ్ చేస్తోంది. ‘అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపడంలో పాక్ కీలక పాత్ర పోషించింది. చర్చలకు అవసరమైన పరిస్థితులను సృష్టించింది. ఇరుపక్షాలకు నమ్మకమైన సమాచార దూతగా వ్యవహరించింది’ అని ఓ సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. అంతా బానే ఉంది కానీ.. ఈ శాంతి బహుమతి కోసం విశ్రాంతి లేకుండా ప్రయత్నించిన ట్రంప్ ఊరుకుంటారా?
News April 9, 2026
జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం

పుట్టపర్తిలోని షాదీ మహల్‌లో గురువారం జర్నలిస్టుల కోసం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ సహకారంతో సమాచార, వైద్య శాఖలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఎస్పీ సతీశ్ కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.


