News March 29, 2024
జగిత్యాల జిల్లాలో 1,18,824 హెక్టార్ల వరి సాగు
జగిత్యాల జిల్లాలో 2023 – 24 సీజన్లో 1,18,824 హెక్టార్ల వరిసాగు జరిగిందని దీనికి గాను 565241 mts ల వరిధాన్యం కొనుగోలు కొరకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గురువారం తెలిపారు. ఈ యాసంగి సీజన్లో వరి ధరలు గ్రేడ్ ఎ 2203, కామన్ ధరలు 2183గా ఉన్నాయన్నారు. ఈ సీజన్‌కు గాను ఐకెపి 133, పీఎసీఎస్ 282, మెప్మా 1, మొత్తం 416 వరి కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించినట్టు ఆమె తెలిపారు.
Similar News
News January 11, 2025
కరీంనగర్: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
ఉమ్మడి KNR జిల్లాలో నిన్న జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. జగిత్యాల(D)లో జరిగిన <<15121069>>రోడ్డు <<>>ప్రమాదంలో జాబితాపూర్ వాసులు అరవింద్, సాయి, కొండాపూర్ వాసి వంశీ మృతిచెందారు. పుట్టిన రోజు <<15121119>>వేడుకలు <<>>జరుపుకోని వస్తున్న మంగపేట వాసి రాజకుమార్, అప్పన్నపేట వాసి అభినవ్‌ను బొలెరో ఢీకొట్టింది. చిన్నకల్వల వాసి ఈశ్వరమ్మను సుల్తానాబాద్ వద్ద <<15121180>>లారీ <<>>ఢీకొనడంతో మరణించింది.
News January 11, 2025
కరీంనగర్: ఫుడ్ పాయిజన్.. అధికారుల SUSPEND
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మా నగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఇటీవల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వి.రేవను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమాచారం ఇవ్వకుండా విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
News January 10, 2025
KNR: సీఎంకు బండి సంజయ్ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీరు ‘నోటితో పొగిడి – నొసటితో వెక్కిరించినట్లు ఉందన్నారు. ఆరోగ్య శ్రీ రూ.10లక్షలకు పెంచి ఆచరణకు వచ్చే సరికి అసలు బిల్లులే చెల్లించకుండా నెట్ వర్క్ హాస్పిటల్స్‌ను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.