News March 18, 2025

జగిత్యాల జిల్లాలో 40.4 హయ్యెస్ట్ టెంపరేచర్

image

జగిత్యాల జిల్లాలో మంగళవారం అత్యధికంగా రాయికల్ మండలం అల్లిపూర్, వెల్గటూర్, బుగ్గారం మండలం సిరికొండ, ఎండపల్లి మండలం మారేడుపల్లి, ధర్మపురి మండలం జైన, సారంగాపూర్ మండలాల్లో 40.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జగిత్యాల, బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మల్లాపూర్ మండలం రాఘవపేట, వెల్గటూర్ మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 21, 2026

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు: SP

image

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పోలీసు శాఖ తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా ప్రణాళికలు సిద్దం చేశామని, పరీక్షలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో యజామాన్యాలు సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు విద్యార్థులు తేవద్దన్నారు.

News February 21, 2026

T20WC.. సూపర్-8లో మ్యాచ్ రద్దయితే?

image

T20WC సూపర్-8లో ప్రతి జట్టు 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఏదైనా కారణాలతో మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే లేదు. అందువల్ల ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. దీంతో మిగిలిన మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. లేదా ఇతర గేమ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా ఇవాళ జరగాల్సిన న్యూజిలాండ్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా ఇప్పటికీ ప్రారంభమవలేదు. గ్రూప్-1లో IND, SA, WI, ZIM, గ్రూప్-2లో ENG, NZ, PAK, SL ఉన్నాయి.

News February 21, 2026

RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

image

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.