News September 12, 2025

జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా రాజా గౌడ్

image

జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్)గా రాజా గౌడ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను అడిషనల్ కలెక్టర్‌ను నియమించినట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు రాజా గౌడ్‌ విధుల్లో చేరనున్నారు.

Similar News

News September 12, 2025

ADB: ‘జాతీయ సమావేశాలు జయప్రదం చేయండి’

image

దివ్యాంగులకు విద్య, ఉపాధి, సంక్షేమం, సాధికారత అంశాలపై ఎన్పీఆర్డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా 2025 అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ జాతీయ సదస్సు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు నగేష్ తెలిపారు. ఈసమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు.

News September 12, 2025

ఆదిలాబాద్ : ఐటీఐల్లో వాక్ ఇన్ అడ్మిషన్లు

image

ఐటీఐ, ఏటీసీలో చేరేందుకు మరొక అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆగస్టు 30 వరకు అడ్మిషన్ గడువు ఉండగా సెప్టెంబర్ 30వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటికే 1వ, 2వ, 3వ దశలలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ వాక్-ఇన్ అడ్మిషన్లలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT.

News September 12, 2025

ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. ప్రజలకు సీఎం పిలుపు

image

AP: ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘పోషకాహారం తినాలి. రోజూ గంట వ్యాయామం చేయాలి. రాత్రి వేళల్లో వెంటనే నిద్రపోవాలి. నా కుటుంబానికి హెరిటేజ్ ద్వారా ఆదాయం వస్తుంది. అందుకే నాకు ఎలాంటి టెన్షన్ లేదు. పూర్తి దృష్టి ప్రజలపైనే ఉంది. రాత్రి వేళ ప్రశాంతంగా నిద్ర పడుతుంది. P-4తో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా జీవిత ఆశయం’ అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో పేర్కొన్నారు.