News July 10, 2025

జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి

image

జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, సాగు, తాగునీరు విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిధులు తెచ్చే బాధ్యత నాది అని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, పథకాలు పేదలకు అందేలా చూడాలన్నారు. కలెక్టర్, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు.

Similar News

News July 10, 2025

నేడు మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0

image

AP: ప్రభుత్వం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనుంది. 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్స్, 1,49,92,456 మంది పేరెంట్స్, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పుట్టపర్తి కొత్తచెరువు ZP స్కూల్లో కార్యక్రమానికి CM చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు.

News July 10, 2025

విశాఖలో CII పార్టనర్షిప్ సమ్మిట్

image

AP: నవంబరు 14,15 తేదీల్లో విశాఖలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ జరగనుంది. సదస్సు సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో CS విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రిజిస్ట్రేషన్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. సదస్సును సక్సెస్ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు.

News July 10, 2025

‘విద్యార్థులారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’

image

అనంతపురం JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్స్‌ను ప్రారంభించినట్లు వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత తెలిపారు. 4 ఏళ్ల బీటెక్ CSE/ECE కోర్సులో మొదట మూడేళ్లు JNTUలో, 4వ ఏడాది స్వీడన్‌లో చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు JNTUలోని డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.