News July 10, 2025
జగిత్యాల జిల్లా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చీటీ శ్రీనివాసరావు విజయం సాధించారు. పట్టణంలోని సుమంగళి గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇందులో తన సమీప అభ్యర్థి బండ స్వామిపై 73 ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్ రావు విజయం సాధించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా సంపూర్ణ చారి, ట్రెజరర్‌గా సిరిసిల్ల వేణుగోపాల్ ఎన్నికయ్యారు.
Similar News
News July 11, 2025
‘బడి పండగ’పై మీ కామెంట్..

కొత్తచెరువు ZPHSలో జరిగిన ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’ విజయవంతమైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నేరుగా విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించడంతో పిల్లల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం టీచర్‌గా మారి పాఠాలు చెప్పడం, లోకేశ్ పిల్లలతో కలిసి పాఠాలు వినడం, మాధవి అనే మహిళ నలుగురు పిల్లల ఉన్నత చదువు బాధ్యతలు తీసుకోవడం ఈ పర్యటనలో హైలైట్. ఎలాంటి పొలిటికల్ టచ్ లేకుండా జరిగిన ఈ కార్యక్రమంపై మీ కామెంట్..
News July 11, 2025
మరికల్: స్థానిక ఎన్నికలు. రిజర్వేషన్లపై ఉత్కంఠ

నారాయణపేట జిల్లాలో 13 జడ్పీటీసీలు, 136 ఎంపీటీసీలు, 272 సర్పంచులు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధం కావడంతో ఆయా మండలాల్లో ZPTC, MPTC, మున్సిపల్ ఛైర్ పర్సన్, కౌన్సిలర్, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్‌కై ఉత్కంఠ నెలకొంది. తాము ఆశించిన స్థానాలు రిజర్వేషన్లు తమకే దక్కే విధంగా నాయకులు పావులు కదుపుతున్నారు.
News July 11, 2025
సంగారెడ్డి: GPOలకు దరఖాస్తుల ఆహ్వానం

గ్రామ పాలన అధికారి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య గురువారం తెలిపారు. దరఖాస్తులను https://forms. gle/rBDToMSakRcPoivWA వెబ్ సైట్‌లో ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మాజీ విఆర్ఓ, వీఆర్ఏలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు.