News February 18, 2025
జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా సోగ్రాభి

జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా కోరుట్ల పట్టణానికి చెందిన సొగ్రబీ నియమితులయ్యారు. ఈ మేరకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు, జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఆధ్యక్షురాలు విజయలక్ష్మీ చేతులమీదుగా సోమవారం నియామకపత్రాన్ని అందుకున్నారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News July 9, 2025
ASF: ఉప్పొంగిన ప్రాణహిత

కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలతో పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత నదులు ఒక్కచోట చేరి తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకాయి. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందువల్ల సమీప గ్రామ ప్రజలు నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
News July 9, 2025
HYD: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.
News July 9, 2025
నష్టాల్లో ముగిసిన సూచీలు.. 25,500 దిగువకు నిఫ్టీ

భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 83,536 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 25,476 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్, ఏషియన్ పేయింట్స్, ఎంఅండ్ఎం, ITC, బజాబ్ ఫైనాన్స్, ఎటర్నల్, NTPC, HDFC బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో, హెచ్‌సీఎల్, ఎల్‌అండ్‌టీ, టైటాన్, ICICI బ్యాంకు షేర్లు నష్టపోయాయి.