News December 30, 2025

జగిత్యాల: జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ జి.సుజాత బాధ్యతలు

image

జగిత్యాల జిల్లా నూతన వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ సుజాత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది నూతన DMHOగా వచ్చిన డాక్టర్ సుజాతకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్‌కి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డా.ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News December 30, 2025

రెవెన్యూ క్లినిక్స్ పేరుతో సమస్యలన్ని పరిష్కరించాలి: CCLA

image

రెవెన్యూ క్లినిక్స్ పేరుతో రెవెన్యూ సమస్యలన్ని పరిష్కరించాలని CCLA ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆమె వీక్షణ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిపూర్ణంగా పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని కార్యదర్శి చెప్పారు.

News December 30, 2025

పల్నాడు పోలీసులకు ప్రతిష్టాత్మక ‘ఏబీసీడీ’ అవార్డు

image

జిల్లా పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మక ‘ఏబీసీడీ’ అవార్డు లభించినట్లు ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని అత్యంత క్లిష్టమైన కేసులను ఛేదించినందుకు ఈ పురస్కారం దక్కిందన్నారు. సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ ఆధారాలతో వరుస చోరీలు, హత్యలు, సైబర్ మోసాలు వంటి కేసుల్లో నిందితులను పట్టుకుని జైలు శిక్షలు పడేలా ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News December 30, 2025

సిరిసిల్ల: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

image

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లా, వేములవాడ మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి.