News April 5, 2025
జగిత్యాల: జిల్లా సెర్ప్ ఏపీఎంల యూనియన్ నూతన కార్యవర్గం

జగిత్యాల జిల్లా కేంద్రంలో సెర్ప్/ఐకేపీ ఎపిఎం ల యూనియన్ సమావేశంలో జగిత్యాల జిల్లా ఎపిఎంల యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కే.శ్రీనివాసచక్రవర్తి, ఉపాధ్యక్షుడిగా ఏ. శంకర్, ప్రధాన కార్యదర్శిగా పి. నరహరి, సహాయ కార్యదర్శిగా డి. సమత, కోశాధికారిగా వై.రమాదేవి ఎన్నికయ్యారు. అలాగే సలహాదారులుగా ఆర్. చంద్రకళ, జి.సి.రాజయ్య నియమితులయ్యారు.
Similar News
News September 16, 2025
MHBD: విద్యార్థిని చితకబాదిన దుకాణం యజమాని

చాక్లెట్లు కొనేందుకు దుకాణానికి వెళ్లిన విద్యార్థిని చితకబాదిన ఘటన కురవి మండలం కంచర్లగూడెంలో చోటుచేసుకుంది. కంచర్లగూడెం పాఠశాలలో విద్యార్థి ఆకాశ్ 5వ తరగతి చదువుతున్నాడు. చిన్నారులు ఏడుస్తుండటంతో చాక్లెట్ల కోసం అతన్ని టీచర్ షాపునకు పంపాడు. అక్కడే ఉన్న కోతులు దాడి చేస్తాయని షాపులోకి వెళ్లిన అతన్ని యజమాని చూశాడు. కోతులు రావడంతో షాపులోకి వచ్చానని చెప్పినా వినకుండా చితకబాదినట్లు బాధితులు తెలిపారు.
News September 16, 2025
ప్రసారభారతిలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని <
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/
News September 16, 2025
నిర్మల్ జిల్లా వర్షపాతం వివరాలు

గడిచిన 24 గంటలలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 397.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా నర్సాపూర్ మండలంలో 46.8, సోన్ 44, కడెం పెద్దూర్ 39.4, మామడ 30, దిలావర్పూర్ 32.4, బైంసా 28.2, ముధోల్ 19.6, లోకేశ్వరం 21.6, నిర్మల్ మండలాలలో 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.