News December 5, 2025
జగిత్యాల: జిల్లా స్థాయి పీఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

జగిత్యాల జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌ను వివేకానంద మినీ స్టేడియంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత ప్రారంభించారు. జిల్లాలోని 16 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన 900 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొన్నారు. ఆటలు విద్యార్థుల్లో ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని లత తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, రాజేష్, చక్రధర్, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యులకు జరుగుతున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు వివరించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదటి విడత రిటర్నింగ్ అధికారులు, సహయ జిల్లా ఎన్నికల అధికారులు ఎంపీడీవోలు, తహశీల్దార్‌లతో మాట్లాడారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు.
News December 6, 2025
నర్సీపట్నంలో రేపు నవోదయ మోడల్ టెస్ట్

PRTU నర్సీపట్నం ఆధ్వర్యంలో నవోదయ మోడల్ టెస్ట్ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు PRTU జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ తెలిపారు. శారద నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మోడల్ టెస్ట్ పరీక్షలు ఉంటాయన్నారు. నవోదయ పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. టెస్టులో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతి ప్రదానం, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు.
News December 6, 2025
సెమీస్‌లో పాలమూరు అండర్-14 క్రికెట్ జట్టు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో జరుగుతున్న అండర్-14 క్రికెట్ పోటీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. పాలమూరు జట్టు వరంగల్, అదిలాబాద్, మెదక్ జట్లపై వరుస విజయాలు సాధించినట్లు కోచ్ సురేశ్ తెలిపారు. జిల్లా జట్టు సెమీస్ చేరడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.


