News April 25, 2024
జగిత్యాల జిల్లా స్పెషల్.. ముగ్గురు ఎంపీలు

జగిత్యాల జిల్లా మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉంది. మొత్తం 20 మండలాలు, 5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో, చొప్పదండి సెగ్మెంట్‌లోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ సెగ్మెంట్‌లోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు కరీంనగర్ ఎంపీ పరిధిలోకి వస్తాయి. ఇక ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి లోక్ సభ స్థానం పరిధిలో ఉంది.
Similar News
News April 8, 2026
KNR: శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అడుగులు

హుస్నాబాద్ ప్రాంతీయ విద్యా విస్తరణలో భాగంగా రెవెన్యూ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మాపూర్ సమీపంలోని సర్వే నంబరు 132/1లో 36 గుంటల భూమిని శాతవాహన సాంకేతిక కళాశాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు రిజిస్ట్రార్‌కి పంపించారు. ఈ స్థలంలో నూతన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలను నిర్మించనున్నారు. దీంతో స్థానిక విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య చేరువకానుంది.
News April 7, 2026
KNR: పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

కరీంనగర్ నగరంలోని పలు 10వ తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం తనిఖీ చేశారు. ఈ మేరకు ఆమె విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు అంశాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
News April 7, 2026
KNR: మారుతున్న జీవనశైలి.. పురోగతి వైపా? ప్రమాదం వైపా?

ఒకప్పుడు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ఇంటి వద్ద వండిన స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం, శరీరానికి తగినంత శ్రమ కల్పించడం మన జీవనశైలిలో భాగంగా ఉండేవి. నేడు కాలం మారింది. సాంకేతికత పెరిగి ప్రపంచం అరచేతిలోకి వచ్చింది, అదే క్రమంలో మన ఆరోగ్యం చేజారిపోతోంది. ఉమ్మడి KNR జిల్లాలో గడిచిన దశాబ్ద కాలంలో మన అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. సౌకర్యాల వెనక పరుగెడుతూ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం. నేడు వరల్డ్ హెల్త్ డే.


