News April 13, 2025
జగిత్యాల జైత్రయాత్ర గురించి మీకు తెలుసా..?

వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.
Similar News
News April 20, 2025
కరీంనగర్: JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య సత్తా

JEE మెయిన్స్-2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు M.రోహిత్ 17, T.కుందన్ 814, P.ఈశ్వర్ ముఖేష్ 1275, M. అంజలి 2575, B. అక్షర 2992, M. తరుణ్ 5949, G. నందిని 7464 ర్యాంకులు సాధించారు. 20వేల లోపు 15 మంది విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించగా.. పరీక్షకు హాజరైనవారిలో 40% మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లితండ్రులను చైర్మన్ రమేష్ రెడ్డి అభినందించారు.
News April 20, 2025
సీఎం విదేశీ పర్యటనపై బండి సంజయ్ ఫైర్

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లో పర్యటిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు కలసి బహిరంగ సభలు పెట్టి ముస్లిం ఓట్ల కోసం డ్రామాలు ఆడుతన్నాయని ద్వజమెత్తారు.
News April 20, 2025
కరీంనగర్: రేపు ప్రజావాణి రద్దు

కరీంనగర్ కలెక్టరేట్‌లో రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూభారతి కొత్త ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారులంతా ఆ సదస్సులకు హాజరు కావలసిన ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.