News April 13, 2025
జగిత్యాల జైత్రయాత్ర గురించి మీకు తెలుసా..?

వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.
Similar News
News November 1, 2025
KNR: తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నాం: కలెక్టర్

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 785 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని గుర్తించామని, IKP, PACs ద్వారా కొనుగోలు బాయిల్డ్ రైస్ మిల్స్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు కొంతమంది రైతులకు సుమారుగా రూ.57 లక్షలు జమ చేశామని తెలిపారు. మిగతా రైతులకు కూడా జమ అవుతాయన్నారు.
News November 1, 2025
నల్గొండ: MGU డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

మహాత్మగాంధీ యూనివర్శిటీ డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల టైం టేబుల్‌ను అధికారులు విడుదల చేశారు. నవంబర్ 13 నుండి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News November 1, 2025
చిన్నసూరారం ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

నల్గొండ మండలం చిన్నసూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా సీరియల్ ప్రకారం కాంటాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు తూకాలు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, బస్తాలు, పట్టాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.


