News April 13, 2025

జగిత్యాల జైత్రయాత్ర గురించి మీకు తెలుసా..?

image

వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్‌ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్‌ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.

Similar News

News April 14, 2025

రుతురాజ్ ప్లేస్‌లో ఎవరికో చోటు?

image

సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బాధపడుతూ ఐపీఎల్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం భావిస్తోంది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రేలపై ఫ్రాంచైజీ దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. మరి వీరిలో ఎవరు సీఎస్కేకు అవసరమో కామెంట్ చేయండి.

News April 14, 2025

గుమ్మడిదల : భార్యతో గొడవ పడి ఆత్మహత్య

image

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగరాజు మనస్తాపానికి గురై వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

News April 14, 2025

కొండాపూర్:ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

image

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తిరిగి పాఠశాలల జూన్ 12న పున ప్రారంభమవుతాయని చెప్పారు. అన్ని పాఠశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. nవేసవి సెలవులో తరగతులు నిర్వహించవద్దని పేర్కొన్నారు.

error: Content is protected !!