News December 22, 2025
జగిత్యాల: టూరిజం ప్రోత్సాహక కార్యక్రమం

జగిత్యాల జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ చేతుల మీదుగా “100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ” పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్రంలోని ప్రజలకు పెద్దగా తెలియని పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తేవడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని కలెక్టర్ అన్నారు. ఆసక్తిగల యువత 3 ఫొటోలు, 60 సెకన్ల వీడియోతో జనవరి 5, 2026లోపు ఎంట్రీలు పంపాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News December 22, 2025
హనుమకొండ: రేపు ఉద్యోగ మేళా

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం మంగళవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. 18 నుంచి 35 సం.ల లోపు ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఆపై చదివినవారు అర్హులన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధృవ పత్రాలతో ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లోని తమ కార్యాలయంలో నిర్వహించే మేళాకు హాజరు కావాలన్నారు.
News December 22, 2025
బూతుల్లేకుండా కథలు చెప్పలేరా?

ఇప్పుడొచ్చే సినిమాల్లో రక్తపాతం, రొమాన్సే కాదు బూతులు కూడా కామనైపోయాయి. చిన్నపిల్లలూ చిత్రాలు చూస్తారు, వింటారనే కామన్‌సెన్సును వదిలేసి తల్లులను అవమానించేలా ల** లాంటి పదాలను నిస్సిగ్గుగా వాడేస్తున్నారు. <<15640612>>ప్యారడైజ్<<>>, <<18643470>>రౌడీ జనార్ధన<<>> వంటి సినిమాలే నిదర్శనం. పైగా ‘కథ డిమాండ్ చేసింది’ అనే డైలాగులు రొటీనైపోయాయి. బూతుల్లేకుండా కథలు చెప్పలేరా? సెన్సార్ బోర్డులేం చేస్తున్నాయి? అనేవి బిలియన్ డాలర్ల ప్రశ్నలు.
News December 22, 2025
పోలీసు వృత్తి సేవా భావంతో కూడుకున్నది: SP

కాకినాడల్ APSP 3వ బెటాలియన్‌లో 2025-26 బ్యాచ్ కానిస్టేబుళ్ల తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా SP బిందు మాధవ్ శిక్షణను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో చేరడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల సేవకు అంకితమయ్యే బాధ్యతాయుతమైన వృత్తి అని పేర్కొన్నారు.


