News December 20, 2025
జగిత్యాల: ‘ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి’

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.
Similar News
News December 30, 2025
కృష్ణా: అజ్ఞాతంలో వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. 2024 జూన్ 7న సునీల్‌పై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 17న మాచవరం పోలీసులు వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి వంశీ కనిపించకపోవడంతో, అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మొన్నటి వరకు నియోజకవర్గంలో ఆక్టివ్‌గా ఉన్న వంశీ సడన్‌గా అదృశ్యమయ్యారు.
News December 30, 2025
సంగారెడ్డి: స్పీడ్‌గా వెళ్లి చెట్టును ఢీకొట్టాడు..!

సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీంపూర్ RDO ఆఫీస్ దగ్గర ఈరోజు మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు పరిధి ఇస్నాపూర్‌కు చెందిన యువకుడు బగ్గు రామారావు తన స్కూటీపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 30, 2025
VZM: ‘కూటమి విద్య, వైద్య విధానాన్ని నిర్వీర్యం చేస్తోంది’

కూటమి ప్రభుత్వం నేడు విద్య, వైద్య విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని జిల్లా పరిషత్ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. నేడు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్నే నేడు కూటమి అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారన్నారు. కొత్తగా జిల్లాకు ఏదైనా పరిశ్రమని తీసుకొని వచ్చారా? అని ప్రశ్నించారు.


