News September 6, 2025

జగిత్యాల: ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్‌లు..!

image

జగిత్యాల జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవం బందోబస్తులో ట్రాన్స్‌జెండర్లతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. HYD తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమైన ప్రజాసేవ కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్‌జెండర్‌లను భాగం చేసిన రెండో జిల్లాగా JGTL నిలిచిందని SP అశోక్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా 11మంది ట్రాన్స్‌జెండర్‌లను నియమించుకోవడంతో సమాజంలో ప్రతి వర్గానికి సమానత్వం, గౌరవం దక్కుతుందని ఆయన అన్నారు.

Similar News

News September 6, 2025

కృష్ణా: ఈనెల 10న షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు

image

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల బాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. ఈ ఎంపికలు ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు గుణదలలో జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావచ్చన్నారు. ఎంపికైన క్రీడాకారులు నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.

News September 6, 2025

అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

image

హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటీ’ మూవీ తొలి రోజు రూ.5.33 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో తక్కువ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అనుష్క నటించిన రుద్రమదేవి మూవీ తొలి రోజు రూ.12 కోట్లు, భాగమతి సినిమా రూ.11 కోట్లు రాబట్టాయి. వాటితో పోల్చుకుంటే ఈ వసూళ్లు తక్కువేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News September 6, 2025

గుంటూరు జిల్లాలో అరకు ఔట్ లెట్లు

image

గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది చోట్ల అరకు కాఫీ ఔట్ లెట్లు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుళ్లూరు గ్రామంలో, హైకోర్టు, అసెంబ్లీ ప్రాంగణాలతో పాటు గుంటూరు నగరంలో రెండు చోట్ల, తెనాలి, పొన్నూరు, మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వెలుగు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరేలా అవుట్లెట్లు ఏర్పాటు కానున్నాయని అధికారులు అంటున్నారు.