News July 22, 2024

జగిత్యాల: డిగ్రీ ఫెయిల్.. యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సై అశోక్ వివరాల ప్రకారం.. రాయికల్ మండలం అయోధ్యకు చెందిన శివాని(18) డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఈనెల 6న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది.

Similar News

News September 9, 2025

KNR: మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శం

image

నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. హుస్సేనీపురా బొంబాయి స్కూల్ నుంచి రాజీవ్ చౌక్ కరీముల్లాషా దర్గా వరకు ర్యాలీ తీశారు. తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన పండుగ వేడుకల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శమన్నారు.

News September 9, 2025

KNR: ప్రజావాణికి 300 దరఖాస్తులు..

image

ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు. 300 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేసి, పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, DRO వెంకటేశ్వర్లు, RDOలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు.

News September 8, 2025

MOUలతో విద్యార్థులకు మరిన్ని రంగాల్లో సేవలు: కలెక్టర్

image

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా కొత్తపల్లి(H) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు “ట్రస్మా” అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు జేఈఈ, ఐఐటీ, నీట్ కోర్సు పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో MOUలు కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరిన్ని రంగాల్లో సేవలు అందిస్తామన్నారు.