News September 6, 2025
జగిత్యాల: తల్లిని కొడుకు వద్దకు చేర్చిన అధికారులు

జగిత్యాల(R) మండలం ధరూర్ గ్రామానికి చెందిన ఆనెగండ్ల కిష్టమ్మ అనే వృద్ధురాలిని శనివారం జిల్లా అధికారులు ఆమె కొడుకు వద్దకు చేర్చారు. కిష్టమ్మను కొడుకు వేధించగా ఇంట్లో నుంచి వెళ్లిపోయి జగిత్యాలలో యాచిస్తూ రోడ్లపై తిరుగుతుండగా సమాజ సేవకులు జిల్లా సంక్షేమ అధికారికి సమాచారం అందించారు. దీంతో కిష్టమ్మ కొడుకు, కోడలు పిలిపించి జగిత్యాల ఆర్డీవో ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి చేర్చారు.
Similar News
News September 7, 2025
దావోస్ పర్యటనలో మంత్రి కొండపల్లి బిజీ బిజీ

దావోస్ పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిజీ బిజీగా గడుపుతున్నారు. SME రంగం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఎటువంటి ప్రోత్సాహకాలు అవసరం అనే అంశంపై గ్లోబల్ SME సమ్మిట్ -2025లో శనివారం ప్రసంగించారు. SMEల అభివృద్ధికి నూతన టెక్నాలజీతో పాటు, యూనివర్శిటీల నుంచే స్టార్టప్‌లను ప్రోత్సహించడం, పరిశోధన-అభివృద్ధి విభాగాల్లో వాటిని మరింత బలోపేతం చేయడం, తదితర అంశాలపై చర్చించారు.
News September 7, 2025
HYDలో PHOTO OF THE DAY

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనోత్సవం సాగర తీరాన జనసంద్రాన్ని తలపించింది. ఉదయం ఖైరతాబాద్ మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్రకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. సెక్రటేరియట్ వద్దకు విగ్రహం చేరుకోగా ఇసుకేస్తే రాలనంత జనం గుమిగూడారు. చుక్కల్లో చంద్రుడి వలే భారీ ఆకారంలో మహా గణపతి, ఆ పక్కనే సచివాలయం ఒకే ఫ్రేమ్‌లో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యం సిటీలో PHOTO OF THE DAYగా నిలిచింది.
News September 7, 2025
బిగ్‌బాస్-9 కంటెస్టెంట్లు వీరేనా?

రేపటి నుంచి ప్రారంభం కానున్న <<17604853>>బిగ్‌బాస్-9లో<<>> పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ SMలో చక్కర్లు కొడుతోంది. వీరిలో ఆషా సైనీ, సంజనా గల్రానీ, ఇమ్మాన్యుయేల్, రీతూ, తనూజ గౌడ, శ్రష్ఠి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, భరణి ఉన్నారని సమాచారం. ఈసారి ఆరుగురు సామాన్యులకు అవకాశం కల్పించినట్లు టాక్. మాస్క్ మ్యాన్ హరీశ్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, మనీష్, ప్రియ వీరిలో ఉన్నట్లు తెలుస్తోంది.