News October 16, 2025

‘జగిత్యాల-తిరుపతి బస్సు సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

జగిత్యాల నుంచి తిరుపతికి ప్రతిరోజూ బస్సు సర్వీస్ అందుబాటులో ఉందని, ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం కల్పన తెలిపారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు ప్రతి గంటకు సూపర్ లగ్జరీ బస్సులు, శంషాబాద్‌కు రాజధాని ఏసీ బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ బస్సుల్లో సీట్లను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

Similar News

News October 19, 2025

నేడు అనంతపురంలో సందడి చేయనున్న సినీ నటి మీనాక్షి

image

సంక్రాంతికి వస్తున్నాం సినీ నటి మీనాక్షి చౌదరి ఆదివారం జిల్లాకు రానున్నారు. అనంతపురంలోని రాజీవ్ కాలనీలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

News October 19, 2025

జనగామ: త్వరలో కొత్త పంచాయతీ అధికారి

image

త్వరలో జనగామ జిల్లాకు కొత్త పంచాయతీ అధికారి రానున్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు కొత్త డీపీవోలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల గ్రూప్- 1లో ఎంపికైన ఎ.నవీన్‌ను జనగామకు నియమించారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్నందున శిక్షణ అనంతరం విధుల్లో చేరనున్నారు.

News October 19, 2025

VKB: మద్యం టెండర్లు.. ఈనెల 23 వరకు గడువు

image

వికారాబాద్ జిల్లాలో 59 మద్యం షాపుల టెండర్లకు శనివారం వరకు 1,750 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న డ్రా తీయనున్నట్లు చెప్పారు.