News September 21, 2024
జగిత్యాల: తీవ్ర జ్వరంతో బాలుడు మృతి

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన మనీశ్(6) జ్వరంతో మృతి చెందాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. మళ్లీ రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు చేయించారు. డెంగ్యూగా నిర్ధారణ కావడంతో కుటుంబీకులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందాడు.
Similar News
News December 31, 2025
KNR: న్యూఇయర్ సెలబ్రేషన్‌లో నిబంధనలు కఠినం

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సీపీ గౌష్ ఆలం ఆంక్షలు విధించారు. బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 వరకు 163 బీఎన్ఎస్ఎస్ చట్టం అమలులో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. డీజేలు, బాణసంచా వాడకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
News December 31, 2025
జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ఠ ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ఠ ధర నిలకడగానే ఉంది. బుధవారం యార్డుకు 23 వాహనాల్లో 203 క్వింటాళ్ల విడి పత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.6,900లకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.
News December 31, 2025
KNR: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తోట ఆదిత్య(34) ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన సమస్యలతో మనస్తాపానికి గురై తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


