News September 8, 2025
జగిత్యాల: తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సత్యనారాయణ

తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్–2025 అధ్యక్షుడిగా సత్యనారాయణ చారి ఎన్నికయ్యారు. నీట్ సమస్యలపై పోరాడేందుకు సోమవారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా రమేష్ లను, అలాగే ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నీట్‌లో తెలంగాణ పిల్లలకు జరుగుతున్న నష్టంపై పోరాడేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
Similar News
News September 8, 2025
హిందీ తప్పనిసరని ఎక్కడా చెప్పలేదు: లోకేశ్

AP: కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం(NEP)లో హిందీ తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ విధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని మాత్రమే చెప్పిందన్నారు. తానూ 3 భాషలు నేర్చుకున్నట్లు ఇండియా టుడే సదస్సులో చెప్పారు. చదువుపై రాజకీయాల ప్రభావం పడకూడదని అభిప్రాయపడ్డారు. నేటి తరం పిల్లలు ఐదేసి భాషలు నేర్చుకుంటున్నారని, ఎక్కువ భాషలతో విదేశాల్లో పనిచేసేందుకు వీలుంటుందన్నారు.
News September 8, 2025
కలికిరికి మాజీ సీఎం రాక నేడు

మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి ఇవాళ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే బస చేస్తారని ఆయన పీఏ కృష్ణప్ప తెలిపారు. సోమ, మంగళవారాల్లో లోకల్‌గా జరిగే పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్తారన్నారు.
News September 8, 2025
RGM: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని C&MD, డైరెక్టర్‌కు లేఖలు

సింగరేణి కార్మికుల సంక్షేమం, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంస్థ C&MDబలరాం, డైరెక్టర్ గౌతమ్ పోట్రుకు లేఖలు పంపినట్లు INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్(RGM) సోమవారం తెలిపారు. ఈనెల 12న జరగబోయే కీలక సమావేశంలో ప్రధాన అంశాలను చర్చించి, ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ సాధించిన లాభాలలో 35% కార్మికులకు వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు.