News December 27, 2025

జగిత్యాల: దారుణ హత్య.. కొనసాగుతున్న దర్యాప్తు

image

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మృతుడిని పెద్దపల్లి జిల్లా తురకల మద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్‌గా స్థానికులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 28, 2025

గచ్చిబౌలికి గుడ్ బై.. ‘ఫ్యూచర్’ ఈ ఏరియాలదే!

image

మూసీ ప్రక్షాళన ప్లాన్‌లో భాగంగా ఉప్పల్, బాపుఘాట్ ఏరియాలు హాట్ కేకుల్లా మారబోతున్నాయి. 50-60 అంతస్తుల బిల్డింగ్స్‌కు ప్రభుత్వం రూట్ క్లియర్ చేస్తోంది. అసలు పాయింట్ ఏంటంటే.. పూర్తి స్థాయి డీపీఆర్ (DPR) ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా, తెర వెనుక పని జోరుగా సాగుతోంది. రూ.400 కోట్లతో బ్రిడ్జ్-కమ్-బ్యారేజ్‌ల ప్లాన్ దాదాపు ఖరారైంది. ఇందుకోసం నిధుల సర్దుబాటు, గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతోంది.

జడ్చర్ల: ట్రాక్టర్‌ కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

image

జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అల్లాపురం ఆంజనేయులు కుమారుడు మణిదీప్‌(5) ఆగి ఉన్న ట్రాక్టర్‌ను స్టార్ట్‌ చేయడంతో, అది అకస్మాత్తుగా కదలడంతో ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్‌ టైరు బాలుడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. కళ్లముందే కుమారుడు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి.