News January 2, 2026

జగిత్యాల: దివ్యాంగుల పట్టభద్రుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

image

జగిత్యాల జిల్లా దివ్యాంగుల పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా దివ్యాంగుల పట్టభద్రుల సంఘం, జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యులు కలెక్టర్‌కు, జిల్లా సంక్షేమ అధికారికి (డి.డబ్ల్యూ.ఓ) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 9, 2026

సదాశివనగర్: అనారోగ్యం బాగా లేక ఆత్మహత్య

image

సదాశివనగర్ మండలం వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన అశోక్ అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News February 9, 2026

నిజాంసాగర్: రూపు కోల్పోతేనేమీ..ఫొటో ఫోజులకు అడ్రస్‌ ఇదే!

image

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకప్పుడు పర్యాటకులను తీసుకెళ్లిన బోటు కాలక్రమేణా నిర్వహణ కరువై ప్రస్తుతం నీటి ఒడ్డున తుప్పు పట్టి రూపురేఖలను కోల్పోయింది. ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఇనుప చట్రంగా మారిన దీనిపైనే ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఓ వ్యక్తి ఫొటో దిగుతున్న సన్నివేశాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.

News February 9, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 09, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు ♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.29 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.