News September 4, 2025
జగిత్యాల దిశా కమిటీ మెంబర్‌గా భూక్య నాయక్

రాయికల్ మండలం ధావన్‌పల్లి వాసికి దిశా కమిటీలో చోటు దక్కింది. ధావన్‌పల్లికి చెందిన బిక్య నాయక్‌ను జగిత్యాల దిశా కమిటీ మెంబర్‌గా బుధవారం ఎంపీ ధర్మపురి అరవింద్ నియమించారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు మోరపెల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు డా. యాదగిరి బాబు, మండల అధ్యక్షులు ఆకుల మహేష్‌కు భూక్య నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News September 5, 2025
నిజాంసాగర్‌కు తగ్గుతున్న ఇన్‌ఫ్లో

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రాజెక్టులోకి 27,933 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైందని ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 15,849 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 16.603 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రధాన కాలువ ద్వారా పొలాలకు 1,000 క్యూసెక్కులను వదులుతున్నారు.
News September 5, 2025
విచిత్ర దొంగతనం.. చికెన్ సెంటర్లో 4 కత్తులు చోరీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో విచిత్ర దొంగతనం జరిగింది. SI రాహుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సల్వాజీ వెంకటసాయి నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లోకి గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చొరబడి రూ.2వేలు విలువచేసే నాలుగు కత్తులను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News September 5, 2025
అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి.. ఓటు వేయండి!

AP: అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ప్రభుత్వం 5 కి.మీ. పొడవైన ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనుంది. ఇప్పటికే 4 ప్రత్యేక డిజైన్లు ఎంపిక చేసింది. వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. <