News November 21, 2025
జగిత్యాల: దేవ్‌జీ ఎక్కడున్నారు..?

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన నేపథ్యంలో మావో పార్టీ ప్రధాన కార్యదర్శి, కోరుట్లవాసి తిరుపతి @ దేవ్‌జీ ఆచూకీ హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన తప్పించుకున్నారా? పోలీసుల అదుపులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. AP ఇంటెలిజెన్స్ ADGP మహేష్ చంద్ర.. దేవ్‌జీ తమ అదుపులో లేరని ప్రకటించడంతో ఆయన ఎక్కడ ఉన్నారనేది చర్చనీయాంశమైంది. భద్రతా బలగాలు ప్రస్తుతం ఆయన కోసమే గాలిస్తున్నాయి.
Similar News
News November 21, 2025
మహబూబాబాద్: నర్సింహులపేటలో విషాదం

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఫకీరాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బొడ్డితండాకు చెందిన రైతు ఆంగోత్ భాను ఆకేరు వాగులో పడి మృతిచెందాడని స్థానికులు తెలిపారు. వ్యవసాయ భూములు ఆకేరు వాగు అవతల ఉండడంతో రైతు భాను బస్తాల టార్పాలిన్లను తీసుకొని వెళ్తున్న క్రమంలో కాలు జారీ వాగులోని కాలువ గుంతలో పడిపోయాడు. అతడిపై టార్పాలిన్లు పడడంతో ఊపిరాడక మృతిచెందాడు.
News November 21, 2025
విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/1)

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వృద్ధి చెందుతున్న విశాఖలో పలువురి <<18351380>>పోలీసుల తీరు<<>> చర్చకు దారి తీస్తోంది. సివిల్ సెటిల్మెంట్లు, రాజకీయ పైరవీలతో అంటకాగుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇటీవల దువ్వాడలో రూ.కోట్ల విలువైన భూమి కోసం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. లా అండ్ ఆర్ఢర్ కోణంలో ఈ ఇష్యూలో ఎంటరైన ఓ సీఐ సెటిల్మెంట్‌కు యత్నించటం ఉన్నతాధికారుల ద్రుష్టికి వెళ్ళింది. గతంలో ఆర్ఐ స్వర్ణలత ఇష్యూ సంచలనమైన సంగతి తెలిసిందే.
News November 21, 2025
విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/2)

విశాఖలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన కొందరు పోలీసు అధికారులు ఇష్టారీతిన వ్యవహిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు అవినీతి పోలీసుల పనితీరుపై స్పెషల్ టీంతో నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీపీ దృష్టిలో ఏ అధికారిపై రిమార్క్స్ ఎక్కువ వచ్చాయి? ఎవరి మీద యాక్షన్ ఉంటుంది? అన్న భయం ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. మీ పరిధిలో పోలీసులు పనితీరుపై కామెంట్ చెయ్యండి.


