News September 2, 2025
జగిత్యాల: దొంగతనం కేసులో నిందితుడికి 5 నెలల జైలు

దొంగతనం కేసులలో నిందితుడికి 5 నెలల జైలు శిక్ష పడిన ఘటన జగిత్యాలలో సోమవారం చోటు చేసుకుంది. రెండు దొంగతనం కేసులలో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ కరణ్ సింగ్ గగన్ సింగ్ తక్ అనే నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనిజ కోహ్లీకార్ నిందితుడికి ఐదు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Similar News
News September 4, 2025
విద్యార్థుల హాజరుపై సమీక్షించాలి: అదనపు కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు సమీక్షించాలని ASF అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 50 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు రావడం లేదని, దీనికి గల కారణాలను తెలుసుకోవాలని ఆదేశించారు.
News September 4, 2025
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

నర్సాపూర్లోని రాయరావుచెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గణనాథుల నిమజ్జనానికి తరలివచ్చే సమయంలో భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై తెలియజేయాలని పుర కమిషనర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మైపాల్, తహశీల్దార్ శ్రీనివాస్, నీటిపారుదలశాఖ మండల అధికారి మణిభూషణ్, మునిసిపల్ సిబ్బంది, తదితరులున్నారు.
News September 4, 2025
GWL: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ముస్తాబు చేయాలి

గద్వాల్ శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ముస్తాబు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 6న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎంపికైన 715 మంది లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభోత్సవానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి హాజరవుతారని చెప్పారు.