News October 21, 2025
జగిత్యాల: నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో SI వీరమరణం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఎస్ఐగా పనిచేసిన క్రాంతి కిరణ్ తన సేవా కాలంలో ప్రజా భద్రత కోసం అహర్నిశలు కృషి చేశారు. విధి నిర్వహణలో ఎప్పుడూ ధైర్యంగా ముందుండే ఆయన, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచారు. తన విధుల్లో ఉన్న సమయంలో 1995 SEPT 29న రంగారావుపేటలో జరిగిన జనశక్తి నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో ఆయన అసువులు బాసారు. ఆయన ప్రాణత్యాగం ప్రజల మనసులో చెరగని ముద్ర వేసింది. SHARE IT.
Similar News
News October 21, 2025
రాయికల్: ‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని వారు వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలం సింగరావుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం ఆలస్యం కాకుండా అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రభుత్వం అందజేస్తున్న ఇసుక లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 21, 2025
రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 5,810 NTPC పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. వయసు పోస్టులను బట్టి 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ పూర్తై ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <
News October 21, 2025
మాదకద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ నిఘా: కలెక్టర్

మాదకద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ నిఘా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి, మత్తు పదార్థాల ఉత్పత్తి, కఠిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అదృశ్యమైన 670 మంది బాలికలను ఒక్క నెలలోనే గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారన్నారు. ఆపరేషన్ సేఫ్ డ్రైవ్ నిర్వహించి 25,807 కేసులు నమోదు చేసి రూ.40.62 లక్షల జరిమానా విధించారని అన్నారు.