News January 3, 2026

జగిత్యాల: ‘నాణ్యమైన విద్య బోధనకు కృషి చేయాలి’

image

నాణ్యమైన విద్య బోధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ రూపొందించిన నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్‌ను అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా విద్యాధికారి రాముతో కలిసి ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. మచ్చ శంకర్, బైరం హరికిరణ్ పాల్గొన్నారు.

Similar News

News January 5, 2026

WGL: మున్సిపల్ పోరుకు సై..!

image

మరో వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 11న షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 12 మున్సిపాలిటీల్లో 49,051 ఎస్టీ, 69,316 ఎస్సీ జనాభా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా, పాత రిజర్వేషన్ల ప్రకారమే జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు.

News January 5, 2026

HYD: పన్నుల లెక్క.. ఎవరి పవర్ ఎంత?

image

GHMC 300 వార్డుల పరిధిలో ఆస్తి పన్ను పంపిణీపై క్లారిటీ వచ్చేసింది. 10 వేల చదరపు అడుగుల లోపు ఇల్లు లేదా ప్లాట్ అయితే DC చూసుకుంటారు. అంతకంటే ఒక్క అడుగు ఎక్కువ ఉన్నా ఫైలు నేరుగా ZC టేబుల్‌పైకి వెళ్లాల్సిందే. 5ఏళ్ల కంటే పాత బకాయిల అడ్జస్ట్మెంట్ వ్యవహారాల్లోనూ ZC గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి. చిన్న మార్పులకు లోకల్ ఆఫీసర్ సరిపోతారు. కానీ, పెద్ద ప్రాపర్టీల లెక్క మాత్రం జోనల్ లెవల్లోనే తేలుతుంది.

News January 5, 2026

నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలి: కలెక్టర్

image

చింతలవలసలోని ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌లో నిర్వహిస్తున్న 37వ వార్షిక క్రీడా పోటీలను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి, సమష్టి తత్వాన్ని అలవర్చుకునేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట APSP కమాండెంట్ రవిశంకర్ రెడ్డి ఉన్నారు.