News April 8, 2025
జగిత్యాల: నామాపూర్ విద్యార్థులకు గోల్డ్ మెడల్

సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ న్యూఢిల్లీ నిర్వహించిన పరీక్షలో పెగడపల్లి మండలం నామాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అన్నాడు చైత్ర రెడ్డి, చెక్క బండి సుస్మిత, సాయి రాజా హంసిత, ఈగ అరుణ్ ఈ పోటీల్లో పాల్గొని జోనల్ స్థాయి ర్యాంకులు సాధించి బంగారు పథకాలు సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థులను ఎంఈవో మాదాడి సులోచన, ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News April 8, 2025
సిట్ విచారణకు హాజరైన శ్రవణ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. HYD జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ విచారణకు A6గా ఉన్న శ్రవణ్ రావు హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ఆయనను మరింత లోతుగా విచారించి, సమాచారం సేకరించాలని సిట్ భావిస్తోంది. గతంలో ఆయన ఎంక్వైరీకి సహకరించలేదని సిట్ వెల్లడించగా, నేటి విచారణపై ఆసక్తి నెలకొంది.
News April 8, 2025
తొండూరులో పూలే బాలికల పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవిత

తొండూరులో నిర్మితమవుతున్న జ్యోతిరావు పూలే బాలికల జూనియర్ కళాశాల, పాఠశాల పనులను మంత్రి సవిత, కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. మంగళవారం పాఠశాల ప్రాంగణంలో పలు గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత స్పష్టంగా కనిపించాలన్నారు. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
News April 8, 2025
పవన్ కుమారుడికి గాయాలు.. CBN, KTR దిగ్భ్రాంతి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై AP CM చంద్రబాబు, మంత్రి లోకేశ్, TG మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘బాలుడు త్వరగా కోలుకోవాలి. ఈ కష్ట సమయంలో పవన్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని చంద్రబాబు, లోకేశ్ ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.